రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతి సంవత్సరం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మహాత్మా జ్యోతిబా ఫూలే సతీమణి సావిత్రిబాయి ఫూలే జయంతి రోజైన జనవరి 3న వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలిచ్చారు. మహిళా విద్య సాధికారతలో భాగంగా ప్రతి సంవత్సరం జనవరి 3న ‘వుమెన్ టీచర్స్ డే’ను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.