ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ EO(Excutive Officer)పై వేటు పడింది. ఆయన్ను బదిలీ(Transfer) చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రొటోకాల్ రగడ వల్లే ఆయనపై వేటు పడినట్లు ప్రచారం జరుగుతున్నది. ఈవో రామకృష్ణారావు స్థానంలో భాస్కర్ రావుకు కొత్త బాధ్యతలు కట్టబెడుతూ సర్కారు ఆదేశాలిచ్చింది.
రచ్చ రచ్చ…
యాదగిరిగుట్ట ఆలయాన్ని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితోపాటు పలువులు మంత్రులు దర్శించుకున్నారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరైన ప్రముఖుల విషయంలో ప్రొటోకాల్ పాటించలేదు. CMతోపాటు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డికి ఎత్తైన పీటలు వేసి ఉప ముఖ్యమంత్రి అయిన భట్టి విక్రమార్కను చిన్నపీటపై కూర్చోబెట్టారు. డిప్యూటీ CMను కావాలనే అవమానించారంటూ సోషల్ మీడియా(Social Media)లో పెద్దయెత్తున వచ్చిన ట్రోలింగ్స్ సంచలనం సృష్టించాయి.
భట్టి వివరణ ఇచ్చినా…
ఇది జరిగిన రెండు రోజులకు భట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు. దేవుడిపై భక్తితోనే తాను చిన్నపీటపై కూర్చున్నానని, ఇందులో ఎలాంటి అనుమానాలు(Doubts) అవసరం లేదని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ ప్రముఖులు కూర్చున్న విధానంపై మాత్రం విమర్శలు ఆగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సర్కారు.. EOపై బదిలీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది.