రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా.. ఈరోజు సైతం 11 జిల్లాల్లో ‘యెల్లో(Yellow)’ అలర్ట్ కొనసాగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఐదు జిల్లాలకు అక్కడి కలెక్టర్లు సెలవు ప్రకటించారు. అయితే మిగతా జిల్లాల్లోనూ కొన్నిచోట్ల బడికి వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. మరి అలాంటి వాతావరణమున్న ప్రాంతాల్లో సెలవు ఉంటుందా, లేదా అన్న సందిగ్ధం ఏర్పడింది.
పరిస్థితుల్ని బట్టి కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని సర్కారు స్పష్టం చేసింది. అయితే ఆయా జిల్లాల్లో ఇప్పటికీ కలెక్టర్ల నిర్ణయం వెలువడకపోవడంతో సంశయం కొనసాగుతున్నది. భారీ వర్షం పడితే స్థానిక MEO, హెడ్ మాస్టర్లే నిర్ణయం తీసుకోవాలని మహబూబ్నగర్లో ప్రకటన వచ్చింది.
ఇక ఇప్పటివరకు ఖమ్మం, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సెలవు ప్రకటించారు. వర్షాలుండే మిగతా జిల్లాల్లో ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో సందిగ్ధం ఏర్పడింది. స్కూళ్లకు వెళ్లినా తరగతి గదులు తడిసి ఉండటం వంటి కారణాలతో నిర్వహణ సాధ్యమా అన్న అనుమానాలున్నాయి.