ఉత్తర తెలంగాణలో ఎండలు ముదురుతున్నాయి. 42 డిగ్రీలు దాటనున్నందున జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు రేపు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఏప్రిల్, మేలో తీవ్రత మరింత పెరగనుండగా, 45 డిగ్రీలు దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. గతానికి భిన్నంగా ఈసారి ఫిబ్రవరి నుంచే ఒకట్రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నాయి. భగభగమండే ఎండలతో మార్చి రెండో వారంలోనే 42 డిగ్రీలకు చేరింది. ఏప్రిల్లో ఇవి మరింత ముదురుతాయని, బయటికెళ్తే జాగ్రత్తలు తప్పనిసరని హెచ్చరించింది. https://justpostnews.com