
గ్రామ పంచాయతీ(Panchayati) ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) కసరత్తు మొదలైంది. ఓటరు సవరణకు షెడ్యూల్ జారీ చేసింది. రేపట్నుంచి ఈనెల 23 వరకు పంచాయతీలు, వార్డుల్లోని ఓటర్ల జాబితాల్లో పొరపాట్లుంటే సవరించాలని ఆదేశించింది. అభ్యంతరాలు స్వీకరించి, 22లోగా పరిష్కరించాలని జిల్లా పంచాయతీ అధికారులకు స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలని జిల్లాల అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అన్నీ పూర్తయ్యాక 23న తుది ఓటర్ లిస్టు విడుదల కానుంది.