@ భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. సిబ్బంది, భక్తులు కలిసి కోవెల ప్రాంగంణంలోని చిత్రకూట మండపంలో కానుకలు లెక్కించారు. కోటీ 62 లక్షల 13 వేల 534 నగదు సమకూరింది. వేసవి రద్దీతోపాటు హనుమాన్ జయంతి సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆదాయం గణనీయంగా పెరిగిందని ఆలయ అధికారులు చెబుతున్నారు. బంగారం 182 గ్రాములు, వెండి 1.80 కిలోలు లభించింది. వివిధ దేశాల కరెన్సీ కూడా సమకూరినట్లు ఈవో తెలిపారు.