Published 17 Nov 2023
సర్వీసు నుంచి తొలగించారన్న మనస్తాపంతో RTC డ్రైవర్ దారుణానికి పాల్పడ్డాడు. తీవ్ర మనోవేదనకు గురై ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దయనీయ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో జరిగింది. RTC డ్రైవర్ నర్సింహులును ఈ నెల 9న అధికారులు సర్వీసు నుంచి తొలగించారు. ఆరు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో వారం రోజులుగా నర్సింహులు తీవ్రంగా ఆవేదన చెందుతున్న అతడు.. రైలు కింద పడి బలవన్మరణానికి(Suicide) పాల్పడ్డాడు.
నర్సింహులు స్వగ్రామం జహీరాబాద్ మండలం ఖాసీంపూర్. దీనిపై ఆర్టీసీలోని యూనియన్లు ఆవేదన వ్యక్తం చేస్తూ దీనికి డిపో అధికారులదే బాధ్యత అని అన్నారు. అధికారుల వేధింపుల వల్లే నర్సింహులు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపించారు.