Published 26 Dec 2023
ఆ యువకుడు, యువతి కొంతకాలం పాటు ప్రేమించుకున్నారు. తర్వాత మనస్పర్థలు వచ్చి ఒకరికొకరు దూరంగా ఉంటూ వస్తున్నారు. తనను కావాలనే దూరం పెడుతున్నాడని సదరు యువతికి కోపం వచ్చింది. ఇంకేముంది.. స్నేహితుల ద్వారా బాయ్ ఫ్రెండ్ ను పిలిపించుకుంది. అప్పటికే గంజాయి(Ganja) కొని దగ్గర పెట్టుకుని జూబ్లీహిల్స్ లోని పబ్ కు వాళ్లతో సహా వెళ్లింది. కానీ అంతకుముందే గంజాయిని ప్రియుడి కారులో పెట్టిందా ప్రియురాలు. పోలీసులకు ఫోన్ చేసి మరీ కారులో పెట్టుకుని గంజాయి అమ్ముతున్నాడని కంప్లయింట్ ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు గంజాయి ఉన్న కారుతోపాటు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన ఏడుగురిలో సదరు ప్రియురాలు కూడా ఉంది.
కానీ విచారణ తర్వాత పోలీసులకు(Police Enquiry) తెలిసిన విషయమేంటంటే… ఆ గంజాయిని కొని కారులో పెట్టింది ఆ ప్రియురాలేనని. ఈ ఘటనలో 40 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుందర్నీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రియుడు చేసిన నిర్వాకానికి పోలీసులకు పట్టిద్దామని అక్రమ మార్గం బాట పట్టిన ఆ ప్రియురాలు సైతం చివరకు పోలీసులకు చిక్కాల్సి వచ్చింది.