Published 28 Dec 2023
139వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకొంటున్న వేళ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి(General Secretary) ప్రియాంక గాంధీపై ఛార్జిషీట్ దాఖలైంది. హరియాణాలో జరిగిన భూకుంభకోణం లావాదేవీల్లో ఆమె హస్తం ఉందంటూ ED(ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్).. ప్రియాంక పేరు ఛార్జిషీట్ లో చేర్చింది. భూమిని కొన్న వ్యక్తికే దాన్ని తిరిగి బదలాయించడం పెద్ద నేరంగా భావిస్తూ ఆమె పేరును ఛార్జిషీట్ లో నమోదు చేసింది. 2006లో ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని ఢిల్లీకి చెందిన హెచ్.ఎల్.పహువా అనే రియల్టర్ నుంచి ఫరీదాబాద్ లో కొనుగోలు చేసి.. 2010లో అతడికే ల్యాండ్ ను అమ్మేశారు. ఈ రెండు లావాదేవీల్లో ప్రియాంక పాత్ర ఉందంటూ ఛార్జిషీట్ లో ED పొందుపరిచింది.
ఇలా 2006, 2010 మధ్య కాలంలో జరిగిన లావాదేవీల్లో ఆమె ప్రమేయం ఉందంటూ ఈడీ ఆరోపించింది. పార్టీ అగ్రనేత పేరునే ఛార్జిషీట్ లో చేర్చడంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం మొదలైంది. ఇప్పటికే CBI, ED దాడులపై మండపడుతున్న కాంగ్రెస్ సహా ఇండియా కూటమి పక్షాలు.. తాజా ప్రియాంక కేసుపై ఎలా స్పందిస్తాయో చూడాలి.