మాధుర్యమైన గాత్రంతో తెలుగు ప్రేక్షకులను దశాబ్దాలుగా అలరిస్తున్న ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాశ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ‘సర్కారు నౌకరి’ అనే చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నాడు. దిగ్గజ దర్శకులు కె రాఘవేంద్రరావు.. తన ఆర్కె టెలిఫిల్మ్ షో బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శేఖర్ గంగామౌని దర్శకత్వం వహిస్తున్నారు. పీరియడ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ కొంత కాలంగా కొనసాగుతుండగా.. శనివారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
థియేటర్ ఆర్టిస్ట్ భావన వాజపండల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇందులో హీరో ఆకాశ్ సైకిల్‌పై కనిపించగా.. బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక చెట్టుపై ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వేలాడుతూ ఉంది. దానిపై ‘పెద్ద రోగం చిన్న ఉపాయం’ అని రాసి ఉన్న క్యాప్షన్ ఆలోచింపజేస్తోంది. ఇక ఆకాష్ లుక్స్ విషయానికొస్తే.. చాలా నేచురల్‌గా కనిపించాడు. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య కొల్హూరి, త్రినాథ్ తదితరులు నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.