పెయింట్(Paint) ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగి పెద్దయెత్తున మంటలు చెలరేగడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మంటల ధాటికి భారీ పేలుడు సంభవించడంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో జరిగింది. అలీపూర్ కు దగ్గర్లోని దయాల్ పూర్ మార్కెట్ వద్ద దుర్ఘటన జరిగి ఏడుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మంటల్ని ఆర్పేందుకు 22 ఫైర్ ఇంజిన్లను రంగంలోకి దించారు.
పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయినట్లు గుర్తించిన అధికారులు… సమీప ప్రాంతంలో పెద్దయెత్తున సహాయక చర్యలు(Rescue Operation) చేపట్టారు.
ఈ ఘటనలో కానిస్టేబుల్ సహా నలుగురికి గాయాలు కావడంతో హాస్పిటల్ కు తరలించారు. పెయింట్ పరిశ్రమలో చెలరేగిన మంటలు సమీపంలోని ఇళ్లు, దుకాణాల(Shops)కు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. మంటల్లో చిక్కుకున్న మరింత మంది కోసం గాలింపు కొనసాగుతున్నది.