హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి(National Highway)పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టడంతో అందులోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద జరగ్గా 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఆరుగురి పరిస్థితి సీరియస్ గా ఉంది.
నిద్రలోనే…
కర్ణాటకలోని బళ్లారి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘోర దుర్ఘటన జరిగింది. మరో గంటన్నరలో హైదరాబాద్ చేరుకుంటామనుకునే లోపే కారులో ఉన్నవారంతా ప్రమాదానికి గురి కావడం ఆవేదనకు గురిచేసింది. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో కారు వేగంగా చెట్టుకు తాకింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. నిద్రమత్తు కారణంగానే ఇన్సిడెంట్ జరిగిందా, లేక అతి వేగమే(Overspeed) కారణమా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
కారులో ఇరుక్కుని…
కారు చెట్టును కొట్టుకున్న ప్రమాదంలో కారులో ఉన్నవారంతా అందులో ఇరుక్కుని నరకయాతన అనుభవించారు. గాయపడ్డవారిని జిల్లా కేంద్రమైన వనపర్తి హాస్పిటల్ కు తరలించారు. అక్కడే చికిత్స(Treatment) తీసుకుంటూ మరో చిన్నారి కన్నుమూసింది. గాయపడ్డ ఎనిమిది మందిలో మరింత మంది కండిషన్ సీరియస్ గా ఉండగా.. మృతదేహాలను కారులో నుంచి బయటకు తీశారు.