కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లకు పెద్ద చిక్కే(Big Trouble) వచ్చి పడింది. ఇప్పటికే పెద్దయెత్తున విచారణ(Enquiry) కొనసాగుతుండగా.. ఈ విషయాన్ని ప్రభుత్వం అంత తేలిగ్గా వదిలిపెట్టడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజినీర్లకు ‘అల్టిమేటం(Ultimatum)’ జారీ చేసింది. దీంతో ఈ యవ్వారం కాస్తా తమపైకి ఎక్కడ వస్తుందోనన్న భయం ఆ ఇంజినీర్లలో కనపడుతున్నది.
NDSA కమిటీ ఎదుట…
కాళేశ్వరం పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై ఇప్పటికే NDSA(National Dam Safety Authority)కి తెలంగాణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ సంస్థ ఎంక్వయిరీకి రెడీ అయింది. CWC మాజీ ఛైర్మన్ అయిన తాజా నిపుణుల కమిటీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల టీమ్ రాష్ట్రానికి చేరుకోగా.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై విచారణ చేపట్టింది. 2016 నుంచి కాళేశ్వరంలో భాగమైన ఇంజినీర్లంతా ఈ నెల 9న కమిటీ ముందు హాజరు కావాల్సిందేనని ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జా స్పష్టం చేశారు. మోడల్ స్టడీస్, హైడ్రాలిక్, డిజైన్స్, నిర్మాణాలు, క్వాలిటీ, ఆపరేషన్, మెయింటెయినెన్స్ వంటి అంశాలపై వివరాలతో రావాలని ఆదేశించారు.
AE నుంచి ENC వరకు…
నిర్మాణంలో భాగస్వామ్యమున్న ఏ ఒక్కర్నీ వదిలిపెట్టేది లేదన్న కోణంలో విచారణ సాగబోతున్నది. అందుకే ఆనాటి నుంచి ఇప్పటివరకు పనిచేసిన అధికారుల్లో AEల నుంచి ENC(Engineer-In-Chief) వరకు అందరూ కమిటీ ముందుకు రావాల్సిందేనంటూ సదరు ఆదేశాల్లో ప్రభుత్వం పూర్తి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం సర్వీసులో ఉన్నవారు, రిటైర్ అయి విశ్రాంత జీవనం గడుపుతున్నవారు సైతం రావాలని సర్కారు అల్టిమేటం జారీ చేసింది. ‘చేసిన తప్పు ఏనాటికైనా పోదు అన్నట్లు’… ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా అడుగులకు మడుగులొత్తితే పరిస్థితి ఇలాగే ఉంటుందన్న మాటలు వినపడుతున్నాయి.