
రంగారెడ్డి జిల్లాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్ ను కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇబ్రహీంపట్నం రాయపోలు వద్ద యాక్సిడెంట్ జరిగింది. మృతులు భానుప్రకాశ్, నవీన్, నారాయణరెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఈరోజు ప్రమాదాల్లో జిల్లాలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఉదయం ఇదే జిల్లాలోని బండ్లగూడ సన్ సిటీ వద్ద కారు… వాకింగ్ కు వెళ్లిన ఇద్దర్ని ఢీకొట్టింది. దీంతో ఆ తల్లి,కూతురు అక్కడికక్కడే మృతి చెందారు.
రాష్ట్రవ్యాప్తంగా 11 మంది…
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రోడ్డు యాక్సిడెంట్లలో మంగళవారం 11 మంది దుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లాలో ఐదుగురు, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ముగ్గురేసి చొప్పున మృత్యువాత పడ్డారు.