విచారణకు రావాలంటూ ఇప్పటికే ఎనిమిది సార్లు ED నోటీసులు అందుకున్న అరవింద్ కేజ్రీవాల్.. బెయిల్ కోరుతూ నేరుగా కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను నిన్న నిరాకరించిన న్యాయస్థానం.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు(Bail Grant) చేసింది. మద్యం కేసులోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం రౌస్ అవెన్యూ CBI కోర్టుకు హాజరయ్యారు.
ముందుగానే…
ఇప్పటికే ఈ కేసులో MLC కల్వకుంట్ల కవితను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడానికి కొద్ది ముందుగానే కేజ్రీవాల్ సైతం రౌస్ అవెన్యూ కోర్టుకు వచ్చారు. లక్ష పూచికత్తు, రూ.15,000 బాండ్ సమర్పించాలని కేజ్రీవాల్ ను న్యాయస్థానం ఆదేశించింది.
ఈడీ కంప్లయింట్…
మరోవైపు తమ విచారణకు కేజ్రీవాల్ సహకరించట్లేదంటూ కోర్టుకు ఈడీ అధికారులు ఫిర్యాదు(Complaint) చేశారు. దీనిపై ఢిల్లీ CMకు న్యాయస్థానం సమన్లు అందజేసింది.