మహారాష్ట్రలో జరిగిన భారీ ఎన్ కౌంటర్(Encounter)లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలు(Security Forces), మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ చెందిన సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. మృత్యువాత పడ్డ నలుగురూ తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందినవారే కాగా.. అందులో ఇద్దరిపై భారీ రివార్డు ఉంది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి.
పేలుడు పదార్థాలు….
ఘటనాస్థలంలో AK-47 గన్, కార్బైన్, ఇతర పేలుడు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన నలుగుర్ని వర్గీశ్, మగ్తూ, కుర్సంగ్ రాజు, కుడిమెట్ట వెంకటేశ్ గా గుర్తించినట్లు అక్కడి SP నీలోత్పల్ తెలిపారు. ఇందులో ఇద్దరిపై గతంలోనే రూ.36 లక్షల మేర భారీ రివార్డు ఉంది. లోక్ సభ ఎన్నికల దృష్ట్యా అలజడి రేపేందుకు తెలంగాణ నుంచి మావోయిస్టులు మహారాష్ట్రకు వస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు కూంబింగ్ జరిపినట్లు తెలిపారు.
కోలమర్క గుట్టల్లో…
ప్రత్యేక యూనిట్లు, C-60, CRPF క్విక్ రియాక్షన్ టీమ్ జాయింట్ గా కూంబింగ్ చేపట్టాయి. భద్రతా బలగాలు కోలమర్క గుట్టలకు చేరుకోగానే మావోయిస్టులు తారసపడటంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు మొదలయ్యాయి.