ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అనుమానం ఉన్న ఏ ఒక్కర్నీ వదిలిపెట్టడం లేదు ED. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ CM మనీశ్ సిసోడియా, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ తోపాటు బీఆర్ఎస్ MLC కవిత సహా పలువురిని అరెస్టు చేసిన ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు.. తాజాగా మరో మంత్రికి నోటీసులు పంపారు. ఆమ్ ఆద్మీ తరఫున ఇప్పటికే కీలక నేతల్ని జైలుకు పంపిన ED.. ఇప్పుడు అదే పార్టీకి చెందిన మరో మంత్రికి నోటీసులు పంపడం కలకలం రేపుతున్నది.
‘ఆప్’సర్కారుకు…
‘ఆప్’సర్కారును ఢిల్లీ లిక్కర్ స్కామ్ అతలాకుతలం చేస్తున్నది. తాజాగా మంత్రి కైలాస్ గెహ్లాట్ కు సమన్లు పంపడంతో ఇంకెంతమంది ఇందులో ఇరుక్కుంటారోనన్న చర్చ జరుగుతున్నది. హోం, రవాణా, న్యాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న కైలాస్ ను ప్రశ్నించేందుకు సమన్లు పంపినట్లు ED తెలిపింది. ఈయన నజఫ్ గఢ్ నియోజకవర్గం నుంచి MLAగా గెలిచారు.
ఆ కమిటీలో కైలాస్…
ఢిల్లీ సర్కారు తయారు చేసిన 2021-22 మద్యం పాలసీ కమిటీలో మనీశ్ సిసోడియాతోపాటు కైలాస్ గెహ్లాట్ కూడా ఉన్నారు. మద్యం పాలసీ విధాన రూపకల్పన, దాని అమలు కోసం ఏర్పాటు చేసిన కమిటీలో కైలాస్ కీలక పాత్ర పోషించారని ED అంటున్నది. ఈయన తన మొబైల్ నంబర్లు మార్చారంటూ ఛార్జిషీట్(Chargesheet)లో ఆరోపించింది.