ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody) విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నెల 15 వరకు ఆయనకు కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన్ను ఇప్పటికే ED అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుంది. ఈ మేరకు ఆయనపై విచారణ పూర్తి కాగా మరోసారి కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. దీంతో కేజ్రీవాల్ కు ఈ నెల 15 వరకు కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది.
ఈరోజు సాయంత్రం….
గత నెల 21న కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన ED అధికారులు.. మార్చి 22 నుంచి తమ కస్టడీలోకి తీసుకుంది. CBI స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఢిల్లీ ముఖ్యమంత్రిని ఈ సాయంత్రం తిహాడ్ జైలుకు తరలించనున్నారు. ఇప్పటికే ఇదే కేసులో BRS MLC కల్వకుంట్ల కవిత సైతం తిహాడ్ జైలులోనే ఉన్నారు.