ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయి జైలు శిక్ష అనుభవిస్తున్న కల్వకుంట్ల కవిత(Kavitha)కు కోర్టు మరోసారి కస్టడీ(Custody) పొడిగించింది. తిహాడ్ జైలులో ఉన్న ఆమెను రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. జులై 3 వరకు నెల రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ న్యాయస్థానం(Court) ఆదేశాలిచ్చింది.
మార్చి 26 నుంచి ఆమె జైలులో ఉన్నారు. ఇంతకుముందు విధించిన కస్టడీ ఈరోజుతో ముగిసిపోవడంతో కవితను అధికారులు కోర్టుకు తీసుకువచ్చారు.