ర్యాంప్ వాక్ చేస్తున్న సమయంలో లైటింగ్ స్తంభం పడటంతో మోడల్ మృత్యువాత పడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలో ఆదివారం జరిగింది. లైట్లను అమర్చిన ఇనుప స్తంభం… ర్యాంప్ వాక్ చేస్తున్న మోడల్స్ పై ప్రమాదవశాత్తూ పడింది. ఈ ప్రమాదంలో ఓ మోడల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈవెంట్లో పనిచేస్తున్న మరో వ్యక్తికి గాయాలైనట్లు నోయిడా పోలీసులు తెలిపారు. వాక్ కోసం అమర్చిన లైట్ల స్తంభం ఉన్నట్టుండి ర్యాంప్ పై పడిపోయింది. అయితే ఈ ఫ్యాషన్ షోకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు.