అతడు అరెస్టు కావడం కామన్. జైలుకు ఇలా వెళ్లి అలా రావడం సంప్రదాయంగా మారింది. అలా ఎన్నోసార్లు(Several Times) అరెస్టై జైలుకు వెళ్లొచ్చినా తన దందాను మాత్రం ఆపలేదు. కానీ ఈసారి అది బెడిసికొట్టి ఇక బయటకు రాకుండా ఊచల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. నాటు సారా తాగి 40 మంది ప్రాణాలు కోల్పోయి, మరో 100 మంది ఆసుపత్రి పాలైన ఘటనలో అసలు నిందితులు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
కల్లకురిచి మృతులకు రూ.10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేల పరిహారం ప్రకటించారు. పాత్రధారి(Main Accused) గోవిందరాజు అలియాస్ కన్నుకుట్టిని పోలీసులు అరెస్టు చేశారు. గతంలోనూ ఇతడు గూండా యాక్ట్ కింద జైలుకు వెళ్లాడు. ఇప్పుడు ఆయన భార్యతోపాటు కల్వరాయన్ హిల్స్ కు చెందిన విదియుర్ రాజా, చిన్నాదురైల్ని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై మద్రాసు హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి.గోకుల్ దాస్ తో ఏకసభ్య విచారణ కమిషన్ ఏర్పాటైంది. కల్లకురిచి జిల్లా కరుణాపురం ప్రాంతంలో జరిగిన వ్యవహారంలో అక్కడి కలెక్టర్, SPపై స్టాలిన్ సర్కారు వేటు వేసింది.