దేశంలో పరీక్షల నిర్వహణపై అనుమానాలు రేకెత్తించేలా తయారైన ‘నీట్(NEET UG-2024)’ అవకతవకలపై దర్యాప్తు(Investigation)ను CBI ప్రారంభించింది. ఈరోజు జరగాల్సిన నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ను వాయిదా వేసిన కేంద్రం.. ఈ కేసును CBIకి అప్పగించిన సంగతి తెలిసిందే. నీట్ క్వశ్చన్ పేపర్ లీకైందన్న ఆరోపణలు, అటు UGC-NET లీక్ కావడంతో పరీక్షల నిర్వహణపై సందేహాలు ఏర్పడ్డాయి.
ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కంప్లయింట్ తో.. CBI అధికారులు ‘నీట్’ పరిణామాలపై కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్‌ను ప్రారంభించారు. బిహార్, రాజస్థాన్‌లో కొంతమందిని అరెస్టు చేయడంతో సమగ్ర దర్యాప్తు కోసం ఆయా రాష్ట్రాల్లో ఫైల్ అయిన కేసులను సీబీఐ స్వాధీనం చేసుకుంటుంది. పలు రాష్ట్రాల్లో అరెస్టయిన వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారణ జరపనుంది.
గతంలోనూ…
2018, 2021లో నీట్ పరీక్షల అక్రమాలపై కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసింది. ప్రస్తుత నీట్ వ్యవహారంపై ఇప్పటికే ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు సీబీఐ ద్వారా అసలు నిజాలు నిగ్గు తేల్చే పనిలో పడింది.