సత్ప్రవర్తన(Good Behaviour) కలిగిన ఖైదీల్ని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. 205 మంది జీవిత ఖైదీల(Prisoners) విడుదలకు మార్గం సుగమమైంది. వ్యక్తిగత పూచీకత్తు రూ.50 వేలను ఒక్కొక్కరు చెల్లించాల్సి ఉంటుంది. దీర్ఘకాలంగా జైళ్లల్లో మగ్గుతున్న తమవారిని విడుదల చేయాలంటూ ఖైదీల కుటుంబ సభ్యులు CMకు ప్రజాపాలనలో దరఖాస్తులు అందజేశారు.
దరఖాస్తుల్ని పరిశీలించిన అధికారులు.. అర్హులైన వివరాల్ని హైలెవెల్ కమిటీ ముందుంచారు. ఈ ఫైల్ ను ఉన్నత స్థాయి(High Level) కమిటీ కేబినెట్ కు పంపింది. దానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆ జాబితాకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో ముందస్తు విడుదలకు జీవోను సర్కారు జారీచేసింది.
ఈ GO వల్ల చర్లపల్లి కారాగారం నుంచి మొత్తం 213 మంది ఖైదీలు విడుదల కానున్నారు. ఇందులో 205 మంది జీవితఖైదీలు, మరో 8 మంది తక్కువకాలం శిక్ష పడినవారు ఉన్నారు. వీరంతా మూడు నెలలకోసారి జిల్లా ప్రొబెషన్ అధికారి ఎదుట అటెండ్ కావాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలియజేసింది.