ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనం చేశాడు.. రూ.60 వేలతోపాటు 12 గ్రాముల బంగారం, వెండి వస్తువులు ఎత్తుకెళ్లాడు.. వెళ్లేటప్పుటు ఒక లెటర్ పెట్టి క్షమాపణతోపాటు ఎత్తుకెళ్లిందంతా తిరిగిస్తానన్నాడు.. చోరీ తర్వాత ఏం జరిగింది.. ఆ లెటర్లో ఏముందో చూస్తే..
నెలలోనే…
తమిళనాడు మేగ్ననాపురంలోని శాతంకులం రోడ్డులో సెల్విన్ అనే రిటైర్డ్ టీచర్ దంపతులు ఉంటున్నారు. తమ కుమారుణ్ని(Son) చూసేందుకు జూన్ 17న వారిద్దరూ చెన్నై వెళ్లారు. వాళ్లు వెళ్లేటప్పుడే సెల్వి అనే ఆమెకు ఇంటి బాధ్యతలు అప్పగించారు.
సెల్వి జూన్ 26న ఆ ఇంటికి వెళ్లి చూస్తే మెయిన్ డోర్ తెరిచి ఉంది. దీంతో వెంటనే ఓనర్ కు ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో ఇంటికి వచ్చిన సెల్విన్ నగలు, డబ్బు పోయాయని గుర్తించారు.
దీంతో ఇక…
సెల్విన్ కంప్లయింట్ తో రంగంలోకి దిగిన పోలీసులకు ఒక లెటర్ దొరికింది. ‘నన్ను క్షమించండి.. నేను దొంగిలించినవి నెలలోనే తిరిగిస్తాను.. నేను ఈ దొంగతనం చేశాక మా ఇంట్లో ఏం బాగోలేదు..’ అని అందులో ఉంది. గతేడాది ఇలాంటి ఘటనే కేరళలోని పాలక్కాడ్ లో జరిగింది. మూడేళ్ల చిన్నారి నుంచి బంగారు నెక్లెస్ ఎత్తుకెళ్లి అమ్ముకున్న దొంగ.. వెళ్తూ వెళ్తూ లెటర్ ను అక్కడ పెట్టాడు.