కేంద్ర టైక్స్ టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ పై దుండగుడు దాడికి యత్నించాడు. బిహార్లోని ఆయన సొంత నియోజకవర్గమైన బెగూసరాయ్(Begusarai)లో జనతా దర్బార్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. మంత్రి అనుచరులపైనా దాడికి పాల్పడ్డ దుండగుణ్ని పోలీసులు అరెస్టు చేశారు. జిహాద్ కు వ్యతిరేకంగా మంత్రి మాట్లాడుతున్న టైంలో షాజాద్ అలియాస్ సైఫీ అనే వ్యక్తి దాడికి వచ్చినట్లు బెగూసరాయ్ SP మనీశ్ తెలిపారు.
మౌల్వీ డ్రెస్ లో ఉన్న దుండగుడు తొలుత పిటిషన్ తీసుకోవాలని కోరాడు. అయితే అప్పటికే దర్బార్ ముగిసిందని, సమయానికి రావాలని చెప్పారు. దీంతో అతడు కోపంగా నినాదాలు(Slogans) చేస్తూ చుట్టూ ఉన్నవారిపై పిడిగుద్దులు కురిపిస్తూ మంత్రిపై దాడి చేయబోయాడు. ఇలాంటి వాటికి భయపడేది లేదన్న గిరిరాజ్ సింగ్.. ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్ దేశానికి ప్రమాదకరం అవుతున్నాయన్నారు.