దేశంలో సంచలనం సృష్టించిన కోల్ కతా డాక్టర్ హత్యాచారం(Rape, Murder) జరిగిన కాలేజీకి సంబంధించి ప్రిన్సిపల్ ను CBI అరెస్టు చేసింది. రెండు వారాల పాటు అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన అధికారులు.. చివరకు అతణ్ని రిమాండ్ కు తరలించారు. అయితే అఘాయిత్యానికి సంబంధించిన కేసులో కాకుండా ఆర్థిక అవకతవకలపై ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను అరెస్టు చేశారు.
ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో ట్రెయినీ డాక్టర్ పై ఆగస్టు 9న హత్యాచారం జరిగింది. ఈ కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షించడంతోపాటు కలకత్తా హైకోర్టు ఆదేశాలతో ప్రిన్సిపల్ ను CBI అదుపులోకి తీసుకుంది. అంతకుముందే అతణ్ని ఇతర హాస్పిటల్ బదిలీ చేసినా చివరకు రాజీనామా చేశారు. అయితే ఆయన కాలంలో కాలేజీలో భారీ అక్రమాలు జరిగాయని గుర్తించిన CBI.. నిందితుణ్ని అరెస్టు చేసింది.