CBI నిద్రపోలేదని, నిజాల్ని వెలికితీసేందుకు సమయ(Time)మివ్వాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నేరం జరిగిన ప్రదేశంలో సాక్ష్యాల(Evidence)ను తారుమారు చేశారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నదని తెలిపింది. కోల్ కతా ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీ ట్రెయినీ డాక్టర్ పై జరిగిన హత్యాచారం కేసులో ఈరోజు విచారణ జరిగింది. బాధితురాలి పేరును వెంటనే తొలగించాలంటూ వికీపీడియాను కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో CBI జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నందున.. సున్నితమైన కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు తొందరపడకూదని CJI డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ‘ప్రిన్సిపల్ తోపాటు SHOను కూడా అరెస్టు చేశారు.. మేము స్టేటస్ రిపోర్ట్ చూశాం.. కాబట్టి వేచిచూద్దాం..’ అని బెంచ్ క్లారిటీ ఇచ్చింది.