అవినీతి నిరోధక శాఖ(ACB) దాడుల్లో ఓ జిల్లా అధికారి పట్టుబడ్డారు. కొత్తగూడెం ఉద్యానవన(Horticulture), సెరికల్చర్ శాఖల అధికారి సూర్యనారాయణ ACBకి చిక్కారు. డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించి సబ్సిడీని ధ్రువీకరించేందుకు గాను రూ.1.14 లక్షలు డిమాండ్ చేసి ఆ నగదు తీసుకుంటున్న సమయంలో అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
సూర్యనారాయణను అదుపులోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు ACB డీఎస్పీ రమేశ్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్లోనే అధికారులు దాడులకు దిగి ఉన్నతాధికారిని పట్టుకున్నారు.