
హైదరాబాద్ లో గ్యాస్ లీక్(Leak) అయి మంటలు అంటుకున్న ఘటనలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తొలుత చిన్నారి మృతి చెందగా… తాజాగా మరో ముగ్గురు సైతం తుదిశ్వాస విడిచారు. దోమలగూడలో మంగళవారం మహిళ పిండి వంటలు చేస్తుండగా గ్యాస్ లీకై మంటలు వచ్చాయి. ముగ్గురు చిన్నారులతోపాటు మొత్తం ఏడుగురికి మంటలు అంటుకున్నాయి. బోనాల సందర్భంగా పిండి వంటలు చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయాల పాలైన బాధితులందరినీ గాంధీ హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకున్న చిన్నారి శరణ్య ప్రాణాలు కోల్పోయింది.
హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ తాజాగా మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో బాధిత కుటుంబం రోదనలకు అంతు లేకుండా పోయింది.