బ్లాక్ బస్టర్ గా నిలిచిన పుష్ప-2(Pushpa-2) ఇప్పటికే బాహుబలి, బాహుబలి-2, KGF సినిమాల రికార్డుల్ని అధిగమించింది. ఇక అమీర్ ఖాన్ ‘దంగల్’పై కన్నేసిన పుష్పరాజ్.. ఇక OTTల్లోకి రాబోతున్నాడు. అయితే దీనికి సంబంధించి పెద్దయెత్తున వార్తలు రాగా.. నెట్ ఫ్లిక్స్ ఇచ్చిన ప్రకటన అయోమయాని(Confusion)కి గురిచేసింది. ‘పుష్ప-2 కమింగ్ ఆన్ థర్స్ డే’ అనే పోస్టర్ కనిపించడంతో ఈ వారంలోనే సినిమా రాబోతున్నదని అంతా ఫిక్సయ్యారు. దీంతో ఇక జనవరి 30 నుంచి OTTలో చూడొచ్చన్న ప్రచారం బాగా జరుగుతున్న టైంలో నెట్ ఫ్లిక్స్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ మళ్లీ కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేసింది. ఈ సినిమా త్వరలోనే OTTలోకి రానుందంటూనే స్ట్రీమింగ్ తేదీని మాత్రం ప్రకటించలేదు. గురువారం అని ఇవ్వడంతో అది ఈ వారమా, లేక వచ్చే వారంలోనా అన్నది సందిగ్ధంగా మారింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.1,900 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఒక్క హిందీలోనే రూ.800 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించిన ఏకైక తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప చిత్రానికి సీక్వెల్ గా గతేడాది డిసెంబరు 5న రిలీజైన పుష్ప-2ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.