ఉగ్రవాదుల ఏరివేతకు జమ్మూకశ్మీర్ లో చేపట్టిన ‘ఆపరేషన్ త్రినేత్ర’లో భాగంగా సైన్యం.. నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. రెండో రోజు నాడు సైన్యం, పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూంఛ్ జిల్లాలోని సూరంకోట్ బెల్ట్ లోని సింధారా ఏరియాలో జాయింట్ ఆపరేషన్ చేపట్టిన బలగాలు.. ఉగ్రవాదుల ఆచూకీని కనుగొన్నాయి. మంగళవారం తెల్లవారుజామున భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమైనట్లు జమ్ము జోన్ అడిషనల్ DGP ముకేశ్ సింగ్ తెలిపారు.
వాహనాల్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్న భద్రతా బలగాలు.. తనిఖీల్లో మందుగుండును స్వాధీనం చేసుకున్నారు.
భారత్ లో ప్రవేశించేందుకు యత్నించిన తీవ్రవాద చొరబాట్లను సోమవారం నాడు బలగాలు భగ్నం చేశాయి. ఆ రోజు ఇద్దర్ని మట్టుబెట్టగా.. మంగళవారం నాడు మరో నలుగురు హతమయ్యారు.