కర్ణాటక మాజీ DGP ఓం ప్రకాశ్(68) హత్య కేసులో నిజాలు వెలుగుచూశాయి. దంపతులు కొట్టుకున్న తర్వాత ఆయన భార్య పల్లవి.. భర్త కళ్లల్లో కారం చల్లి పదేపదే కత్తితో పొడిచినట్లు విచారణలో తేలింది. ఛాతి, పొత్తి కడుపులో పోట్లతో ఆయన అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు ఆ మాజీ DGP సైతం భార్యపై గ్లాస్ బాటిల్ విసిరారని గుర్తించారు. హత్య అనంతరం పల్లవి.. మరో పోలీసు అధికారి భార్యకు విషయం చెప్పింది. పల్లవితోపాటు ఆమె కూతుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆస్తి తగాదాలే హత్యకు కారణంగా భావిస్తుండగా, కూతురి ప్రమేయంపైనా దృష్టిపెట్టారు. 1981 IPS బ్యాచ్ కు చెందిన ఓం ప్రకాశ్ బిహార్ వాసి కాగా.. 2015 మార్చిలో కర్ణాటక పోలీస్ బాస్(DGP)గా నియమితులయ్యారు.