పాక్ ఆర్మీ దుర్భలం(No Use)గా మారడంతో ఆ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. మదర్సాల్లోని విద్యార్థులను యుద్ధంలోకి లాగేందుకు ఆదేశాలు ఇచ్చింది. భారత అస్త్రాలను ఏ మాత్రం అడ్డుకోవడం చేతకాని సైన్యంపై అక్కడి రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్రంగా మండిపడ్డారు. వారికంటే మదర్సాల్లోని పిల్లలే మేలని భావించినట్లుంది సర్కారు. అందుకే ఉన్నట్టుండి పిల్లలంతా సైన్యంలోకి రావాలని ఆదేశించింది. పాక్ జెట్ ఫైటర్లు ఐదింటిని భారత సైన్యం కూల్చివేయడంపై ఆ దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఇటు సైన్యం విఫలం, అటు ప్రత్యర్థి బలంతో దిక్కుతోచని స్థితిలో షహబాజ్ సర్కారు.. చివరకు మదర్సా విద్యార్థుల్ని రంగంలోకి దించుతోంది.