భారత అంతర్గత సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు అందించిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు కోర్టు రిమాండ్ విధించింది. ఆమెకు 4 రోజుల రిమాండ్ విధిస్తూ హరియాణాలోని హిసార్ కోర్టు ఆదేశాలిచ్చింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఆమె పాక్ ISI అధికారులతో సంబంధాలు కొనసాగించినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో జరిపిన సంభాషణను ఆమె అంగీకరించారు.