ఫైవ్ స్టార్ హోటల్స్.. AK-47తో బాడీగార్డ్స్.. ఎక్కడకు వెళ్లినా వెనకాలే షార్ప్ షూటర్స్.. ఇదీ భారత యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు పాక్ లో దక్కిన హోదా. భారత రహస్యాల్ని శత్రు దేశానికి చేరవేసిన కేసులో అరెస్టయింది. ఆమెకు అక్కడ లభిస్తున్న రాచమర్యాదల్ని స్కాటిష్(Scotland) యూట్యూబర్ తన వీడియోలో బయటపెట్టారు. సాధారణ యూట్యూబర్ కు అసాధారణ భద్రత ఏంటని అంతా షాకయ్యారు. లాహోర్ అనార్కలీ బజార్లో జ్యోతి నడుస్తుంటే అక్కడి ప్రజలు ఆమె సెల్ఫీల కోసం వెంటపడ్డారు. ఎప్పుడంటే అప్పుడు వీసా, ISI ఏజంట్లతో సంబంధాలు, డానిష్ అనే ISI అధికారితో బంధం.. ఇలా పాకిస్థాన్ లో VVIPగా మారింది జ్యోతి మల్హోత్రా. హరియాణా కోర్టు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఊచలు లెక్కబెడుతోంది.