అతిపెద్ద బిజినెస్ స్కూల్ కోల్ కతా ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(IIM)లో విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. కౌన్సెలింగ్ కు పిలిచారంటూ హాస్టల్ కు వెళ్లిన ఆమె.. డ్రగ్స్ కలిపిన డ్రింక్ తాగి స్పృహ కోల్పోయింది. తర్వాత అత్యాచారం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది ఎక్కడైనా చెబితే చంపేస్తామంటూ నిందితుడు బెదిరించాడని తెలిపింది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్ కతాలో గత కొద్దినెలల్లో జరిగిన మూడో అతిపెద్ద ఘటన ఇది. మొన్న ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీ, న్యాయ కళాశాలలో.. ఇప్పుడు IIMలో దారుణాలు జరిగాయి. మమత సర్కారుపై కోర్టుల చీవాట్లు, విమర్శలు వస్తున్నా అఘాయిత్యాలు ఆగడం లేదు. https://justpostnews.com