60 ఏళ్ల వృద్ధురాలామె. రాత్రిపూట పొలం నుంచి ఇంటికి వెళ్తుండగా కారు ఢీకొని ప్రాణాలు కోల్పోయింది. యాక్సిడెంటే అనుకున్నా తర్వాత తెలిసింది అసలు గుట్టు. రూ.60 లక్షల బీమా డబ్బు కోసమేనని, చంపించింది అల్లుడేనని పోలీసుల విచారణలో తేలింది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్ద మాసాన్ పల్లిలో జరిగిన ఘటనలో.. కారుతోపాటు డ్రైవర్ ను CCTV ఫుటేజీలో గుర్తించారు. అత్తను చంపేందుకు రూ.1.30 లక్షల సుపారీని ఆమె అల్లుడే ఇచ్చాడని నిర్ధారించారు. అతడు పొలం వద్దే ఉండి అత్తను ఇంటికి పంపించి దారిలోనే హత్య చేయించినట్లు గుర్తించారు. ముందుగానే ఆమె పేరు మీద మూడు రకాల ఇన్సూరెన్సులు చేయించాడు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారనేందుకు తాజా ఉదాహరణిది.