హైదరాబాద్ మలక్ పేట(Malakpet) శాలివాహన నగర్ పార్కులో చందులాల్ రాథోడ్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. కళ్లల్లో కారం చల్లి పలు రౌండ్లు కాల్పులు జరిపారు. భూతగాదాలా, ఇతర కారణాలున్నాయా అన్నది తేలాల్సి ఉంది. జనాల మధ్యన పొద్దున వాకింగ్ సమయంలో కాల్పులు జరగడం అక్కడున్నవారిని భయానికి గురిచేసింది. కమ్యూనిస్టు పార్టీ నాయకుడు చందునాయక్.. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం నర్సాయిపల్లి వాసి. ఇంకొకసారి తిరిగివస్తానంటూ ఆయన ఒకవైపు వాకింగ్ వెళ్లగా.. భార్య, కుమార్తె మరోవైపు నిల్చున్నారు. ఇంతలోనే వారి కళ్లముందే కాల్పులు జరిగి ఇంటిపెద్ద ప్రాణాలు కోల్పోయారు.