‘సృష్టి’ క్లినిక్ సరోగసి కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. సికింద్రాబాద్ గోపాలపురంలోని క్లినిక్ పై నిన్న పోలీసులు దాడి చేశారు. ఆన్లైన్లో తెలుసుకున్న దంపతులు గతేడాది ఆగస్టులో డాక్టర్ నమ్రతను కలిశారు. IVF కాకుండా సరోగసి బెటరని చెప్పి రూ.30 లక్షలు అడిగారు. విశాఖలో స్పెర్మ్ ఇచ్చాక సరోగేట్ మొదలైంది. బేబీ గ్రోత్ గురించి సమాచారం ఇస్తుండటంతో డబ్బులు ఎప్పటికప్పుడు చెల్లించారు. విశాఖలో బిడ్డ పుట్టిందని, చాలా కష్టమైనందున ఎక్కువ డబ్బు అడిగారు. పాప ఆనవాళ్లపై అనుమానాలతో DNA టెస్టుకు దంపతులు డిమాండ్ చేశారు. హాస్పిటల్ వెళ్దామని ట్రై చేస్తే బెదిరించారు. నమ్రత కొడుకు లాయర్ కాబట్టి ఫిర్యాదుదారుల్ని బెదిరించేవాడని గుర్తించారు. డాక్టర్ నమ్రత ఆమె తనయుడు జయంత్ కృష్ణ, విశాఖలోని కల్యాణితోపాటు పలువురు ఏజంట్లను అరెస్టు చేసినట్లు DCP రష్మీ పెరుమాళ్ తెలిపారు.