అత్యాచారం(Rape) కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ(Devegouda) మనవడు, మాజీ MP ప్రజ్వల్ రేవణ్ణకు జీవితఖైదు పడింది. 47 ఏళ్ల పనిమనిషిని ఫాంహౌజ్ లో అత్యాచారం చేసి వీడియో తీశారన్న కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు ఇచ్చింది. రేవణ్ణ కర్ణాటకలోని హసన్ MPగా పనిచేశారు. సాక్ష్యాల్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సేకరించారు. 14 నెలల విచారణలో 26 మంది సాక్ష్యాలతో జడ్జి సంతోశ్ గజణ్ణ భట్ జీవిత ఖైదు వేశారు. 2024లో రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయాక వందలాది పెన్ డ్రైవ్ లు సంచలనం రేపాయి. ఎన్నికలకు బెంగళూరు వచ్చిన ఆయన్ను మే 31న అరెస్టు చేశారు. బాధితురాల్ని మైసూర్ సమీపంలోని ఫాంహౌజ్ నుంచి రక్షించారు.