రూ.3 వేల కోట్ల లోన్ల మోసం కేసులో అనిల్ అంబానీ కంపెనీలో తొలి అరెస్టు జరిగింది. అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూపునకు చెందిన బిశ్వాల్ ట్రేడ్ లింక్ ప్రైవేట్ లిమిటెడ్ MD పార్థసారధి బిశ్వాల్ అరెస్టయ్యారు. రిలయన్స్ పవర్ కు రూ.68.2 కోట్ల రుణాల కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఫేక్ డాక్యుమెంట్లు ఇచ్చారన్నది ఆరోపణ. నకిలీ డాక్యుమెంట్లు సమర్పించినందుకు రిలయన్స్ పవర్ నుంచి బిశ్వాల్ రూ.5.4 కోట్ల లబ్ధి పొందినట్లు ED అభియోగం మోపింది. డమ్మీ డైరెక్టర్లతో 7 బ్యాంకు ఖాతాల ద్వారా వ్యవహారం నడిపినట్లు గుర్తించారు.