చెవిటి, మూగ యువతిపై ఇద్దరు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. 24 గంటల్లోనే ఎన్ కౌంటర్ జరగ్గా ఆ ఇద్దరు గాయాలతో బతికి బయటపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ బలరాంపూర్(Balrampur) జిల్లాలో జరిగింది. మేనమామ ఇంటి నుంచి బయల్దేరిన ఆమె తన ఇంటికి చేరేలోపే కిడ్నాప్ కు గురైంది. మూగ అమ్మాయి కావడంతో అరవలేకపోగా.. నిర్మానుష్య ప్రాంతంలో గ్యాంగ్ రేప్ చేశారు. వందలాది CCTV కెమెరాల ఆధారంగా కొన్నిగంటల్లోనే అంకుర్ వర్మ, హర్షిత్ పాండేను పట్టుకున్నారు. జిల్లా ఉన్నతాధికారులుండే ప్రాంతంలోనే ఈ దారుణం జరిగింది. ఇది జరిగిన బహదూర్ పూర్ పోలీస్ పోస్ట్ ఏరియాలో 3 CCTV కెమెరాలు స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి. కానీ SP ఇంటి వద్ద గల కెమెరాలో అమ్మాయి పరుగెడుతున్న 14 సెకన్ల ఫుటేజ్ తో దుండగుల్ని గుర్తించారు.