ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు అనుమానిస్తున్న ఘటన హైదరాబాద్ మియాపూర్(Miyapur)లో జరిగింది. మహబూబ్ పేటలోని మక్తా అనే వారి నివాసంలో ఈ కుటంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా సేడం మండలం రంజోలి వాసులుగా అనుమానిస్తున్నారు. ఇంటి యజమాని లక్ష్మయ్య(60)తోపాటు ఆయన భార్య వెంకటమ్మ, కూతురు కవిత, అల్లుడు అనిల్, రెండు సంవత్సరాల బాలుడు మృతుల్లో ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మేస్త్రీ పనిచేసుకునే లక్ష్మయ్య ఇంటికి అల్లుడు, కుమార్తె వారం క్రితం వచ్చారు.