రూ.1.15 కోట్ల విలువైన భవనం.. రూ.1.43 కోట్ల 17.10 ఎకరాల భూములు.. 1.7 కిలోల బంగారం, వెండి నగలు.. స్థిర, చరాస్తుల విలువ రూ.5.02 కోట్లు. ఇదీ.. వరంగల్ ఫోర్ట్(Warangal Fort) మండల తహసీల్దార్ బండి నాగేశ్వర్ రావు వద్ద దొరికినవి. ఇవన్నీ డాక్యుమెంట్ విలువ ప్రకారమే. అతని కుటుంబ సభ్యులు, బంధువులకు చెందిన 7 ప్రాంతాల్లో ACB అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. 23 చేతి గడియారాలు, రెండు ఫోర్ వీలర్ వాహనాలు గుర్తించారు. అక్రమాస్తుల కేసు నమోదు చేసిన అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.