చోరీలకు పాల్పడే నిందితులు CC కెమెరాల కంట పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏటీఎం దొంగతనానికి వచ్చిన దుండగులు.. అందులోని సీసీ కెమెరాల్ని వేరే వైపునకు తిప్పి చోరీకి పాల్పడ్డారు. సికింద్రాబాద్ కార్ఖానా ప్రాంతంలో దుండగులు ATMను ధ్వంసం చేశారు. సౌత్ ఇండియన్ బ్యాంక్ ATM పగులగొట్టినట్లు పోలీసులు తెలిపారు. CC కెమెరాల యాంగిల్స్ మార్చి మరీ చోరీకి పాల్పడ్డారని గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.