హైదరాబాద్(Hyderabad)లో భారీ డ్రగ్స్ రాకెట్ పట్టుబడ్డ కేసులో మహారాష్ట్ర పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందుకోసం ఓ పోలీసునే కార్మికుడిగా పంపించారు. చర్లపల్లి వాగ్దేవి లాబొరేటరీస్ లో నిన్న(సెప్టెంబరు 6న) ముఠా దొరికింది. అయితే ఈ ల్యాబ్ పై మిరా-భయాందర్, వసాయ్-విరార్ పోలీసులు ముందునుంచే నిఘా పెట్టారు. ఫార్మా కంపెనీ పేరిట భవనాన్ని వోలేటి శ్రీనివాస్ విజయ్ లీజు తీసుకున్నాడు. పట్టుబడ్డ బంగ్లాదేశీ యువతి ఇచ్చిన సమాచారంతో.. మెఫిడ్రిన్ తయారీని బయటకు తీశారు. నెల రోజుల పక్కా ప్లాన్ తో కోట్ల విలువైన మత్తుపదార్థాన్ని పట్టుకున్నారు. శ్రీనివాస్ గతంలోనూ డ్రగ్స్ కేసులున్నట్లు గుర్తించారు.