
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో కీలక ముందడుగు పడింది. ఫరీదాబాద్ అల్-ఫలాహ్(Al-Falah) వర్సిటీలో ఆరుగురు జూ.డాక్టర్లను అరెస్టు చేశారు. ప్రొఫెసర్ గా పనిచేసిన డా. ఉమర్ మహ్మదే ఆత్మాహుతి
బాంబరయ్యాడు. అందులోని విద్యార్థుల్లో 40 శాతం కశ్మీరీలే ఉన్నారు. మరోవైపు ఈ పేలుడు కేసుపై ప్రాథమిక నివేదిక కేంద్ర హోంశాఖకు అందింది. అల్-ఫలాహ్ వర్సిటీ డాక్టర్ల ప్రమేయంపై దర్యాప్తు నడుస్తోంది. డా.ముజమ్మిల్, డా.షహీన్ అరెస్టయ్యాక తాను కూడా దొరికిపోతాననే ఉద్దేశంతోనే ఆత్మాహుతికి పాల్పడ్డట్లు భావిస్తున్నారు. ఢిల్లీకి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న వర్సిటీలో ఇంత జరుగుతున్నా, టన్నుల కొద్దీ పేలుడు పదార్థాలు నిల్వ చేస్తున్నా బయటకు రాలేదు.