
ఢిల్లీ బాంబు పేలుడు ఘటనలో 18 మందిని అరెస్టు చేశారు. హస్తిన, UP, కశ్మీర్ తోపాటు వివిధ రాష్ట్రాలను భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. పేలుడుకు కారణమైన i20 కారును అక్టోబరు 29న తీసుకున్నాక 10 రోజుల పాటు అల్-ఫలాహ్ వర్సిటీలోనే ఉంచారు. బ్లాస్ట్ కు ముందు కీలక ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. అరెస్టైన డాక్టర్లు ముజమ్మిల్, షహీన్ ఫోన్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆత్మాహుతికి పాల్పడ్డ మహ్మద్ ఉమర్ సైతం అదే వర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. కశ్మీర్ లో MBBS పూర్తి చేసి జైషే మహ్మద్ సహా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకున్నాడు.