గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో రెయిన్ ఫాల్స్ రికార్డ్ అవుతున్నాయి. ఒక్క రోజులోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో 61.8 సెంటీమీటర్ల వాన పడింది. గత 24 గంటల వ్యవధిలో 35 ఏరియాల్లో 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా రికార్డయింది. ఇక 200 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
2019 జులై 19న ములుగు జిల్లా వాజేడులో 51.7 సెంటీమీటర్లు నమోదైన రికార్డును చిట్యాల అధిగమించింది.