
లాకప్ డెత్ పై 9 మంది పోలీసులకు ఉరిశిక్ష పడింది. తూత్తుకుడి జిల్లాకు చెందిన మొబైల్ షాప్ యజమాని పి.జయరాజ్(58), ఆయన కుమారుడు జె.బెనిక్స్(31)ని బట్టల్లేకుండా దారుణంగా హింసించారని తమిళనాడు మదురై జిల్లా కోర్టు గుర్తించింది. 2020 జూన్ 6న జరిగిన ఘటనలో సీఐ, ఇద్దరు ఎస్సైలు, ఆరుగురు సిబ్బందికి కఠిన శిక్ష విధించింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. అరుదైన కేసుగా భావించి మరణశిక్ష విధించాలని కోరింది. తొలుత ఈ కేసును సీబీసీఐడీ చేపట్టగా, హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. లాక్ డౌన్ సమయంలో అనుమతించిన దానికంటే ఎక్కువ సమయం దుకాణం నడిపారని అరెస్టు చేశారు.